భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు మత్స్యకారులు, ప్రజలు చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు. రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాలను, వైర్లను చేతులతో తాకవద్దని పేర్కొన్నారు.