Friday, October 9, 2026
spot_img
HomeTELANGANAఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ పరిధిలోని చాపలబావి ప్రాంతంలోని సెకండ్ బజార్ లో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిర్రబోయిన బద్రీనాథ్ యాదవ్, బిగ్ టివి, మెడీకవర్ హాస్పటల్, లయన్స్ క్లబ్ ఐ హాస్పటల్ ల సౌజన్యంతో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటు హాస్పటల్స్ కు వెళ్లి ఖర్చు భరించలేని పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఇక్కడ ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన మందులు కూడా అందిస్తారని, గత 15 ఏళ్ళుగా శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో చేపట్టానని, సామాజిక బాధ్యతతో అందరూ ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన బద్రీనాథ్ యాదవ్ ని ఎమ్మెల్యే శ్రీగణేష్ మనస్పూర్తిగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ కమిటీ చైర్మన్ వెంకట్రాజు, నాయకులు శేఖర్, జనార్ధన్, దేవేందర్ తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments