రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం ఎంత మంది రైతులు ధాన్యం కేంద్రంలో పోశారు? ఇప్పటిదాకా ఎన్ని క్వింటాళ్లు ధాన్యం సేకరించారని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆరా తీశారు. రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని వసతులు కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడారు. రైతులందరూ తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి, మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దళారులకు విక్రయించవద్దని కోరారు. .