నేడు స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలోని 24వ వార్డు టిఆర్ఎస్ పార్టీ వార్డు కార్యదర్శి కోడిమ్యాల నరేష్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువు కట్టపై జామ చెట్లు మామిడి చెట్లను నాటారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం రోజున చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని ఈ చెట్లు పెరిగి భావితరాలకు ఫలాలను ఇస్తాయని అంతరించిపోతున్న అడవులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యతగా చెట్లను నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని భావితరాలకు ఆనవాళ్లుగా ఈ చెట్లు నాటే కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు..