ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని పులిచేరు కుంట మైసమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా హోమ కార్యక్రమానికి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఈ మూడు రోజుల అమ్మవారి కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, జడ్పిటిసి గుండం నర్సయ్య, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్, గౌడ్ ప్యాక్స్ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు బద్దిపడగ ప్రతాపరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.