‘‘హిందువులం కూడా ప్రేమిస్తాం. కానీ మేం ప్రేమించేది దేవుడిని. లవ్ జిహాద్‌కు పాల్పడేవారికి వారి భాషలోనే సమాధానం చెప్పండి. మీ ఇంటి అమ్మాయిల్ని కాపాడుకోండి. సరైన విలువలను నేర్పించండి. హిందువులూ కనీసం మీ ఇళ్లలో కత్తులనైనా పదునుగా చేసుకుని ఉంచుకోండి. ప్రతి ఒక్కరికి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంది’’ అని బీజేపీ ఎంపీ ప్రగ్యా థాకూర్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులు రావడంతో పోలీసులు ప్రగ్యాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.