మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత సాధన కోసం జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అందుకోసం మార్చి 1వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరుపుకుందామన్నారు మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షులు కానాపురం లక్ష్మణ్ మాదిగ. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఉదయం పది గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని మండలాల నాయకులు ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్, విహెచ్పిఎస్, ఎంఎస్ఎఫ్, అనుబంధాల సంఘాల నాయకత్వం కార్యకర్తలు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు సీనియర్ నాయకులు తప్పకుండా సమయానికి హాజరు కావాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎలగందుల బిక్షపతి మాదిగ ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి గుండ్రెడ్డి రాజు మాదిగ, సీనియర్ నాయకులు ప్రతాప్ మాదిగ తదితరులున్నారు.