Saturday, November 15, 2025
spot_img
HomeTELANGANAఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి: ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్

ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి: ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్

KCR, KTR మెప్పు పొందడం కోసం బడుగు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నం ప్రభాకర్ పైన అసత్య ఆరోపణలు చేస్తున్న నిన్ను వదిలిపెట్టేది లేదు. కేంద్ర పర్యావరణ శాఖ మార్గదర్శకాల మేరకే ఫ్లైయాష్ తరలింపు జరుగుతుంది. సమాజంలో బడుగు బలహీన వర్గాల నాయకులు ఎదుగుతుంటే బిఆర్ఎస్ నేతలు చూసి ఓర్వలేక, అనేక కుట్రలు చేస్తున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పార్టీ కౌశిక్ రెడ్డి రామగుండం నుండి తరలించబడుతున్న ఫ్లై యాష్ లారీల్లో ఓవర్ లోడ్ తో వెళ్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంలో అవినీతికి పాల్పడుతున్నారని నిరాధార ఆరోపణలు చేస్తూ పొన్నం ప్రభాకర్ పరువుకు భంగం కలిగిస్తున్నాడు.

మానుకోట మీద తెలంగాణ వాదులపై రాళ్లు వేసిన చరిత్ర నీదైతే, తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పప్పెర్ స్ప్రే దాడికి గురైన అయిన చరిత్ర మా పొన్నం ప్రభాకర్ అన్నది. అక్రమ ఇసుక రవాణాలో భాగంగా నెరేళ్ళ గ్రామంలో మీ పార్టీ చేసిన అరాచకం ఈ తెలంగాణ సమాజం ఎప్పటికి మరవదు. రామగుండం ఎన్టిపిసి లో ఉత్పత్తి అయిన ఫ్లై యాష్ మరియు బాటమ్ యాష్ 100% ఇతర ప్రజా వినియోగ అవసరాల కోసం బయటకి తరలించడానికి కేంద్ర పర్యావరణ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది, దీనిని టెండర్ల ద్వారా ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది దీని తరలింపు ఎన్టిపిసి మాత్రమే చూసుకుంటుంది.

గత బి.ఆర్.ఎస్ పాలనలో జరిగిన అక్రమ ఇసుక తరలింపు నిలిపివేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం, ఇసుక మాఫియాను అరికట్టడంలో విఫలమైన సంబంధిత శాఖలు గోదావరి రివర్ మేనేజ్మెంట్ కు 25 కోట్ల రూపాయలు చెల్లించాలని మూడు శాఖలకు జరిమానా విధించిన విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది. ఈ తీర్పు అనంతరం నియోజకవర్గంలో ఇసుక తరలింపు నిలిపి వేయడంతో అవినీతి సొమ్ముకు అలవాటు పడిన కౌశిక్ రెడ్డి, అక్రమ ఆదాయం ఆగిపోవడంతో అక్కసుతో, ప్రజాధనాన్ని కాపాడాలని సమర్ధవంతమైన పరిపాలన నిర్వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక
వారిపైన బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే కౌశిక్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేయడం జరిగింది.

ఫ్లైయాష్ ఓవర్ లోడ్ విషయంలో ఎన్టిపిసి మార్గదర్శకాల మేరకే లారీలలో తరలిస్తున్నామని, ఓవర్ లోడ్ తో వెళ్లడం వల్ల లారీలు టైర్లు పంచరవడం ప్రమాదం జరగడం వంటి పరిస్థితులు ఉంటాయని లారీ యజమానులు స్పష్టం చేయడం జరిగింది. నీ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వీణవంక జమ్మికుంట హుజూరాబాద్ మండలాలలో కాంట్రాక్టర్లతో అభివృద్ధి పనులు చేయించుకొని ముడుపులు ఇస్తే తప్ప బిల్లులు ఇవ్వలేమని వారిని ఎంతటి ఇబ్బందులకు గురిచేసావో నీ హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసు. అలాంటి నువ్వు మా పొన్నం ప్రభాకర్ అన్నను విమర్శించడం సిగ్గుమాలిన చర్య. ఇంకోసారి మా మంత్రి పొన్నం ప్రభాకర్ పైన గాని, కాంగ్రెస్ ప్రభుత్వం పైన గాని నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, తగిన రీతిలో నీకు బుద్ధి చెప్పి తీరుతామని ఎంపీటీసీ గుండెల్ని శ్రీనివాస్ హెచ్చరిoచారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments