ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రముఖ వైద్యుడు అయిన డాక్టర్ చింతోజ్ శంకర్ జన్మదిన వేడుకలు ప్రెస్ క్లబ్(TUWJ) అధ్యక్షుడు అబ్రమేని దేవేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ శంకర్ కు TUWJ ప్రెస్ క్లబ్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ శంకర్ మండల ప్రజలకే కాకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చే పేద ప్రజలకు చేస్తున్న వైద్యసేవ అమోఘమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు