మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్ట్‌లో పర్యాటక దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. 386 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ లోటుతో..రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు ఈ రెండో టెస్ట్ మూడోరోజైన బుధవారం వర్షంతో ఆట నిలిపివేసేసరికి 15/1 స్కోరుతో నిలిచారు. కెప్టెన్ ఎల్గర్ (0) డకౌట్‌కాగా, ఇర్విన్ (7), బ్రూయిన్ (6) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియాను మళ్లీ బ్యాటింగ్‌కు దించాలంటే దక్షిణాఫ్రికా ఇంకో 371 పరుగులు చేయాలి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 386/3తో మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 575/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కీపర్ అలెక్స్ క్యారీ (111) తొలి టెస్ట్ సెంచరీతో కదం తొక్కాడు. గ్రీన్ (51 బ్యాటింగ్) అర్థ శతకంతో సత్తా చాటాడు. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.