రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలం దగ్గర అగ్గి మంటలు లేసి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. భీమరి నర్సయ్య పొలం వద్ద మంటలు లేసి గడ్డివాములు అదేవిధంగా గుడిసె, పైపులు, స్టాటరు కాలి బూడిదై భారీగా నష్టం జరిగినట్లు తెలిసింది. నిన్న మొన్న, పట్వారి బాలయ్య, రమేష్ కుర్మశంకర్, అల్లే నరసయ్య, కొలకాని దేవయ్య ల మోటర్లు పైపులు, గడ్డివాములు, గుడిసెలు, మోటర్లు, స్టార్టర్లు దగ్ధమై భారీ నష్టం జరిగింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారికి నష్టపరిహారము ఇవ్వాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అందే సుభాష్, అల్లె శంకర్ ఉస్కే శీను, గుండ్ల రాజు కోరారు.