ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్.చిన్నారి పిల్లలకు భవిష్యత్ లో పోలియో రాకుండా అరికట్టవచ్చని “నిండు జీవితానికి రెండే చుక్కలు”అని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు. కిషన్ దాస్ పేట లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో సందర్భంగా చిన్నారి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎం శారద, అంగన్ వాడీ వర్కర్లు కవిత, సునిత,ఆశ వర్కర్ లక్ష్మి పాల్గొన్నారు.