రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ కేశవ పెరుమాండ్ల ఆంజనేయ స్వామి ఆలయంలొ 29-01-2025 బుధవారం మాఘ అమావాస్య సందర్భంగా గుట్ట మీద జాతర ఉంటుందని ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. 400 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా గత 8 సంవత్సరాలుగా దాతల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని ఎల్లారెడ్డిపేట మండలంతో పాటు పరిసర మండలాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయకమిటీ సభ్యులు తెలియజేశారు. మాఘ అమావాస్య సందర్భంగా ఎక్కడైనా ఆంజనేయస్వామి ఆలయాలలో పూజలు జరుగుతాయి కానీ ఎల్లారెడ్డిపేటలో ఉన్న శ్రీ లక్ష్మి కేశవ పెరుమాండ్ల స్వామి వార్లకు ఉదయం నుండి అభిషేకాలు అర్చన కలశ పూజలు చేయడం ప్రత్యేకత కావున స్వామివార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని శ్రీ లక్ష్మీ కేశవ పెరుమాండ్ల ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పారిపెళ్లి రామ్ రెడ్డి, వైస్ చైర్మన్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్, కోశాధికారి గంప నరేష్, కమిటీ సభ్యులు, రైటర్ గుండాడి వెంకటరెడ్డి తెలియజేశారు.
