కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బొమ్మకల్ బైపాస్ రోడ్డులోని వి కన్వెన్షన్ లో ఆదివారం తేదీ 10 -03- 2024 ఉదయం 12-00 గంటలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల గౌడ సంఘాల ఐక్యవేదిక ఆద్వర్యంలో నిర్వహించ తలపెట్టిన గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొంటారని కాబట్టి గౌడ సోదరులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం ప్రతినిధులు బుర్ర వెంకటేష్ గౌడ్, గుగ్గిళ్ళ జగన్ గౌడ్, కందుకూరి దేవదాస్ గౌడ్ లు పిలుపునిచ్చారు,
గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనం కరపత్రాలను స్థానిక గౌడ సంఘం ప్రతినిధులతో కలిసి వారు ఆవిష్కరించారు, ఈ సందర్భంగా బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ గౌడ జాతి ముద్దుబిడ్డ బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ ఉద్యమ నేత మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అని ఆయన గుర్తు చేశారు. విద్యార్థి దశలోనే రాజకీయ అరంగేట్రం చేశారని కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఎన్ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షునిగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని ఆయన అన్నారు,
రాష్ట్ర మార్క్ ఫెడ్ అధ్యక్షునిగా కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషిచేసిన గొప్ప వ్యక్తి అని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని చూరగొని ఎమ్మెల్యేగా గెలుపొందారని తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నియమించబడడం ఎంతో హార్షనియం అభినందనీయం ఇది గౌడ జాతికి ఎంతో గర్వకారణమన్నారు, వారిని గౌరవించడం మనకెంతో ఆత్మీయము అందుకే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గౌడ సోదరులు జిల్లా నలుమూలల నుంచి తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్, గౌడ సంఘం జిల్లా డైరెక్టర్ గంట వెంకటేష్ గౌడ్ , గౌడ సంఘం ప్రతినిధులు కోల నారాయణ గౌడ్, ముష్కం దత్తాత్రేగౌడ్, పందిళ్ళ సుధాకర్ గౌడ్, నాగుల ప్రధీప్ గౌడ్, బొలగం రంగా గౌడ్, గంట అంజాగౌడ్ , బుచ్చిలింగు సంతోష్ గౌడ్, పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్ , మర్తన్న పేట లక్ష్మణ్ గౌడ్, చెట్కూరి దినేష్ గౌడు తదితరులు పాల్గొన్నారు