రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఫిబ్రవరి 2న ఇంద్రవల్లిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశం బోథ్ నియోజకవర్గంలో పాటు నేరడిగొండ మండల కేంద్రంలో ఏఐసీసీ స్టేట్ కోఆర్డినేటర్ తుల అరుణ్, బోధ్ నియోజకవర్గ ఇంచార్జీ ఆడే గజేందర్ తో ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల కష్టంతో, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని సూచించారు..