ప్రతిమ మీ ముంగిట్లో ఆనే నినాదంతో ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ, ప్రతిమ ఫౌండేషన్ మారుమూల గ్రామాల ప్రజల అవసరాలను గుర్తించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్ లోని విద్యార్థుల మంచి నీటి సమస్య గురించి డాక్టర్ చెన్నమనేని వికాస్ దృష్టికి తీసుకరావడంతో వారి అభ్యర్థనకు స్పందించి ఉచిత మంచి నీటి శుద్ద జల కేంద్రంని డోనేట్ చేశారు. అనేక రకాల జబ్బులకు కలుషిత నీరే కారణం. త్రాగే నీరు శుద్ధ జలమై ఉండాలి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ మంచి నీటి శుద్ద జల కేంద్రంను డోనేట్ చేశారు. ఈ కార్యక్రమం 01.03.2024 శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తెలంగాణ మోడల్ స్కూల్ లో ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవంకు ముఖ్య అతిథిగా ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ చెన్నమనేని వికాస్, దీప దంపతులు హాజరై ప్రాంభించనున్నారు.