కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద, ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకొనుటకై ఈరోజు రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సీపీఐ, సీపీఎం, సిపిఐ ఎంఎల్, న్యూడెమోక్రసీ జిల్లాలోని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా సదస్సు జరిగింది. ఈ జిల్లా సదస్సు సందర్భంగా నాలుగు పార్టీలకు సంబంధించిన జిల్లా నేతలు దుర్గం దినకర్, జగజంపుల తిరుపతి, ఎం. సత్యనారాయణలు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. సదస్సును ఉద్దేశించి *సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం. డి. చాంద్ పాషా మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా అన్ని రంగాల్ని నాశనం చేసిందని, మతోన్మాద విధానాల్ని ముందుకు తెస్తూ మత విభజన రాజకీయాల్ని చేస్తూ రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రజాస్వామ్య విలువల్ని నాశనం చేస్తూ పరిపాలన కొనసాగించిందని, బడా పెట్టుబడిదారులు ఆదాని అంబానీలకు దేశంలో ఉన్న 25 మంది బడ కార్పొరేటు శక్తులకు వ్యాపారులకు దేశ సంపదను కట్టబెట్టిందని, అన్ని రంగాలను ప్రైవేటు పరం చేసిందని, ఉద్యోగ భద్రతను లేకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషించిందని, 80 శాతం నిరుద్యోగ యువత ఇవాళ దేశంలో ఉద్యోగాలు లేక వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందని ఆవేదనతో నిరాశతో ఉన్నారని మరొకసారి అధికారంలోకి రావడానికి మోడీ ప్రభుత్వం అనేక రకాలుగా ఎత్తుగడలతో ముందుకు వస్తుందని, అనేక రకాల తప్పుడు హామీలను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇస్తుందని, మత రాజ్యాంగాన్ని మనువాద రాజ్యాంగాన్ని, తీసుకురావడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుందని, మధ్య యుగాల నాటి వ్యవస్థ బానిస వ్యవస్థను తీసుకురావడం కోసం రాజ్యాంగాన్ని మారుస్తామని దుర్మార్గమైన పద్ధతులకు పాల్పడుతుందని, ఇవాళ దేశంలో కార్మికులు, రైతులు, కూలీలు, యువత ఏ రంగంలో చూసిన అన్ని రంగాలను పట్టించుకోకుండా నిర్వీర్యం చేసే దిశగా 10 సంవత్సరాల పరిపాలన కొనసాగిన తీరు దుర్మార్గమైనదని మరొకసారి ఓట్లు దండుకోవడానికి ఎన్నికల ఎజెండాలో భాగంగానే అయోధ్య విషయాన్ని రాముడు విషయాన్ని ముందుకు తెచ్చిందని, గత ఎన్నికలకు ముందు పులువామా దాడులను వాడుకొని సైనికులను బలి చేసిందని, ఇవాళ మరొకసారి మోసం చేయడానికి రాముడు పేరును ముందుకు తెచ్చి ఈ దేశానికి రాముడే శ్రీరామరక్ష ఇవాళ ప్రజల బలహీనతలను మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని పరిపాలన చేయడానికి ముందుకు వస్తున్న బిజెపిని దానికి అనుకూలంగా ఉన్న శక్తులను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు రూపంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో సిపిఐ సభ్యులు ప్రశాంత్, డోనజి, సాగర్, సిపిఎం జిల్లా నాయకులు గొడిసెల కార్తిక్, టిఖనంద్, మాలశ్రీ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రత్నం పోషన్న, లచ్చన్న, పొశం, శ్రీనివాస్, తిరుపతి, మల్లన్న, అరుణ మరియు వామపక్ష పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.