కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణా పట్ల వివక్షకు నిరసనగా కార్యక్రమా లు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు శాసన సభ్యులు KR నాగరాజు ఆదేశాల మేరకు నేడు వర్ధన్నపేట మండలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల, టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు అబిడ్ రాజు రెడ్డి, వర్ధన్నపేట టౌన్ ప్రసిడెంట్ మైశా సురేష్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరుకుడు వెంకటయ్య లు విలేఖర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాధనలకు కేంద్ర బడ్జెట్లో నిధులు దక్కలేదు, పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి వినతి పత్రం ఇచ్చినప్పటికీ బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు మొండి చెయ్యి చూపిందని కేటాయింపు లపై రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రానికి విడిగా వివరాలను పంపినా ప్రధాన ప్రాజెక్టులకు నిదులేవి పెద్దగా రాలేదని గత మూడేళ్లుగా కేంద్రం నుంచి గ్రాంట్ల పద్దు కింద పూర్తి స్థాయిలో నిధులు దక్కలేదన్నారు. దాదాపు పదేళ్లుగా విబజన హామీలు అమలు కోసం ఎదురు చూస్తున్న తెలంగాణకు ఈ సారి కూడా కేంద్ర బడ్జెట్లో నిరాశా మిగిలిందని బయ్యారం స్టీల్ ప్లాంట్ ఉసే లేదని అదిలాబాద్ సిమెంట్ ప్లాంటు పునరుద్ధరణ లేదని నిజామాబాద్ పసుపు బోర్డ్ కు నిధులు ఇవ్వలేదని ఆహార భద్రత చట్టానికి గతములో 2.70 లక్షల కోట్లు కేటాయిస్తే ప్రస్తుత్వం 2.04 కోట్లకు కుదించడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు సమ్మెట సుధీర్, తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణ, యూత్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ప్రతి బాను, మార్కెట్ డైరెక్టర్ లు యెద్దు శ్రీనివాస్, మల్యాల దేవేందర్, టెంపుల్ డైరెక్టర్ బండి సరిత, ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా కార్యదర్శి చిదుముల్ల భాస్కర్, ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా నాయకులు తూల్ల రవి, టౌన్ కాంగ్రెస్ నాయకులు సిలివేరు శ్రీధర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మల్లేపాక సమ్మయ్య, మాజీ డైరెక్టర్ మాదవి, తాటికాయల దిలీప్, బిర్రు రాజు, పోసాని దేవేందర్ రావు, మరుపట్ల ప్రశాంత్, MD సోహెల్, జన్ను బిక్షపతి, అనిమి రెడ్డి రామచంద్రారెడ్డి, దుప్పెల్లి రమేష్, దుబ్బ యాకయ్య లు పాల్గొన్నారు


