తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ ఆధ్వర్యంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులకు గత ఐదు నుండి ఏడు నెలల వరకు వేతనాలు పెండింగ్ ఉన్నాయని సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారని రాష్ట్రంలో మల్టీపర్పస్ వర్కర్ విధానంతో ఉద్యోగ భద్రత కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రూ. 9,500 వేతనాలు కూడా అందరికీ రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఐదు నుండి ఏడు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, జీవో నెంబర్ 51 సవరించాలని ,మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్ లకు పంచాయతీ సహాయ కార్యదర్శిలు గా నియమించాలని, అందరినీ పర్మినెంట్ చేయాలని, ఆలోపు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, మరణించిన కార్మికులకు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అమలు కోసం విధివిధానాలను ఖరారు చేయాలని, పిఎప్ ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలని, ఆదివారం పండుగ సెలవులు అమలు చేయాలని, చనిపోయిన కార్మికుల దహన ఖర్చుల నిమిత్తం 20000 రూపాయలు చెల్లింపులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, గంగారం, బాబురావు, T గంగారం, దుర్గ ప్రసాద్, అనిల్, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు