అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, ఆయన సూచించిన మార్గంలో పయనించి నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రోజున వేములవాడ పట్టణంలో బహుజన సేన ఆధ్వర్యంలో నిర్వహించిన భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 133 వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భముగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పాటు అందించారని, ఆయన ఆశయసాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, అంబేద్కర్ జయంతి ఉత్సవాలను మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు జరుపుకోవడం మనకు గర్వకారణం అన్నారు. దేశ స్వతంత్ర ఉద్యమంలో ఆనాటి మహనీయులతోని కలిసి కీలకపాత్ర పోషిస్తూనే దేశ స్వతంత్ర అనంతరం తన మేదో సంపత్తితో ప్రపంచంలో మన దేశం ఏ విధంగా ముందుకు పోవాలో మార్గదర్శనం చూపిన గొప్ప మహానియుడన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి అన్ని దేశాల్లో ఉన్న చట్టాలను మేళవింపు చేసుకొని మన దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. చట్ట సభల్లో బలహీన వర్గాలు కోసం పోరాడిన యోధుడని, వారి ఆలోచనలను ఈ తరం యువత స్పూర్తిగ తీసుకొని ముందుకు పోవాలని ఆనాడే రానున్న కాలాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో బడుగు, బలహీన, వర్గాల ప్రజలు ఎ విదంగా ముందుకు పోవాలో సూచించిన గొప్ప మేధావి అన్నారు. ఆ మహనీయుడి ఆలోచనలకు అనుగుణంగా ప్రస్తుత ప్రభుత్వాలు నడుస్తున్నాయని, వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం అన్నారు.