సిరిసిల్ల పట్టణలో జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్, టేస్కాబ్ & నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు లతో కలిసి పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ కార్మికులు వాళ్ళ కుటుంబాల జీవితాలు ఆగం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికలలో తగిన బుద్ది చెప్పాలని అన్నారు. రానున్న పార్లమెంటు ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపు కోసం మీరందరూ కృషి చేయాలని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో బోయిన్పల్లి వినోద్ కుమార్ భారీ మెజార్టీ తో గెలిపించే బాధ్యత మన అందరి పైన ఉంది అన్నారు. 100 రోజుల కాంగ్రెస్ బాండ్ పేపర్ పాలనలో ఉద్దరించుడు మాట దేవుడెరుగు కానీ, అన్నీ ఉద్దెర మాటలే చెప్తున్నారు. 6 గ్యారెంటీ లలో ఇస్తానన్న మొదట హామీ అయిన ప్రతి నెల రూ. 2,500 లు డిసెంబర్ నెల నుండి ఇస్తా అన్న హామీ నిలబెట్టుకోవాలి. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.