Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAవాడి వేడిగా ప్రజాపాలన గ్రామసభ

వాడి వేడిగా ప్రజాపాలన గ్రామసభ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గురువారం గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ వాడివేడిగా సాగింది. ప్రజా పాలన గ్రామసభలో భాగంగా ఎంపీడీవో సత్తయ్య లబ్ధిదారుల పేర్లు ప్రకటించగా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. వివిధ పథకాలకు 1500 మంది దరఖాస్తు చేసుకోగా 1200 మందికి వచ్చాయని అధికారులు తెలపడంతో మిగతా వారిని ఎందుకు తొలగించారని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. దీంతో ఇరువు వర్గాల నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. లబ్ధిదారుల పేర్లు తెలియజేయాలని బిఆర్ఎస్ నాయకులు పట్టుబట్టడంతో అధికారులను అడ్డుకోవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు వాదించారు. తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఇరు వర్గాల వారిని చదరగొట్టారు. దీంతో ప్రశాంత వాతావరణ ఏర్పడింది. స్పెషల్ ఆఫీసర్ అఫ్జల్ బేగం మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు నిరంతర ప్రక్రియ అని ఎవరు ఆందోళన చెందవద్దని అన్నారు లిస్టులో పేర్లు రానివారు మరోసారి నమోదు చేసుకోవచ్చని అందరూ సంయమనంతో ఉండాలని కోరారు. ఈ ప్రజా పాలన గ్రామసభలో కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments