ఎల్లారెడ్డి పేటలో ఆధార్ కార్డు సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రజాహిత కార్యక్రమములో బాగంగా ఎల్లారెడ్డిపేటకు వచ్చిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ వినతి పత్రం అందజేశారు. ఎల్లారెడ్డి పేటలో గతంలో ఆధార్ కార్డు సెంటర్ ఉండగా దానిని కొన్ని కారణాల వల్ల తీసివేశారని ప్రస్తుతం ఎల్లారెడ్డిపేటలో పది వేల జనాభా ఉందని ఆధార్ కార్డు సెంటర్ ఎల్లారెడ్డి పేటలో లేకపోవడంతో గొల్లపల్లి లో గల డెక్కన్ గ్రామీణ బ్యాంక్ లో గల ఆధార్ కార్డు సెంటర్ కు వెల్లాసి వస్తుందని దీనివలన ఎల్లారెడ్డిపేట ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గొల్లపల్లి కి, సిరిసిల్ల కు వెళ్లి ఆధార్ కార్డు తీసుకోవడానికి అనేక వ్యయ ప్రయాసలకు ప్రజలు. గురవుతున్నారని ఎంపీ బండి సంజయ్ తో మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో ఆధార్ కార్డు సెంటర్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని ఎంపీ అన్నారు. ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట జ్యోతి తదితరులు ఉన్నారు.