రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు పథకంతో బలిపీఠమెక్కిన ఆటోవాలా. ఫైనాన్సులు కట్టలేక, కుటుంబాలను పోషించలేక, ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్ల బాధను తెలంగాణ ప్రభుత్వం అర్ధం చేసుకొని వెంటనే స్పందించి, ఆటో కార్మికులను, ఆదుకోవాలని, ఈరోజు 16.2.2024 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పిలుపు ఇవ్వడంతో ఎల్లారెడ్డిపేటలో ఆటోవాలాలు బందు నిర్వహించారు. ఈ సందర్భముగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ను, నమ్మి ఓట్లు వేస్తే మా కుటుంబాలను రోడ్డుపై పడేశారని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయచేసి మా ఆటో వాళ్ళ బ్రతుకులు గురించి ఆలోచించి, ఉచిత బస్సు పధకాన్ని సడలింపు చేసి మాకు ఉపాధి కల్పించాలని, కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు పుడరి దేవరాజు, ఉపాధ్యక్షులు బొడ్డు రాజు, షేక్ నవాబ్, ఖయోం, గుండం శ్రీనివాస్, ఆసిఫ్, కట్టెల బాలయ్య, దర్శన్, దేవయ్య, మల్లారెడ్డి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.