కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో భాగంగా గృహజ్యోతి పథకం ఉచిత విద్యుత్ ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో అధికారికంగా ప్రారంభించారు, మాచర్ల దేవరాజు ఇంటికి జీరో కరెంట్ బిల్లు అందజేసిన విద్యుత్ శాఖా సిబ్బంది. ఈ సందర్భంగా ఇంటి యజమాని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా ఉచిత విద్యుత్తు జీరో కరెంట్ బిల్, రావడం పట్ల మాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ జీరో కరెంట్ బిల్ వల్ల మా కుటుంబానికి నెలకు సుమారు 400నుంచి 700 వరకు ఆదా అవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జంగా అంజిరెడ్డి, అధ్యక్షులు రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు జంగా శ్రీకాంత్ రెడ్డి, యూత్ అధ్యక్షులు కొండే రాజు రెడ్డి, ఎంపీటీసీ పద్మ దేవయ్య, Md హైమద్, Md హామీదు, బాలూయాదవ్, సయి గౌడ్, నవీన్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.