Wednesday, May 29, 2024
spot_img
HomeTELANGANAవెంటాడి వేటాడుతాం: KTR

వెంటాడి వేటాడుతాం: KTR

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు నెరవేర్చే వరకు వెంటాడి వేటాడుతామని తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన పోరాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ ఘాటుగా హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని సాయి శివ ఫంక్షన్ హాలులో శనివారం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరై మాట్లాడుతూ సిరిసిల్లకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలో నెర్రలు బారిన నేలలు దర్శనమిస్తున్నాయని వాటిని చూసి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే పంటలు ఎండిపోయేటివి కావని రైతులు గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఘాటుగా విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ పేరుతో 420 హమీల పుస్తకాన్ని కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. కాలేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ ప్రాజెక్టు కాదని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు అని 21 పంపింగ్ స్టేషన్ లు ఉన్నాయని 1770 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు నిర్మాణం చేయబడినవని తెలిపారు. 1.6 కిలోమీటర్లు ఉండగా కేవలం రెండు పిల్లర్లు మాత్రమే డ్యామేజ్ అయ్యాయని వాటిని వెంటనే నిర్మాణం చేపట్టి నీటిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉంటే క్షణాల్లో రిపేర్ చేసే వాళ్ళమని పేర్కొన్నారు. 618 మీటర్ల ఎత్తుకు నీళ్లను తీసుకువచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం అని గుర్తు చేశారు. రైతులకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదని ఎన్నికల కోడ్ రాకముందే వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డల పెళ్లిలకు ఇప్పటివరకు తులం బంగారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. వంద రోజులు చూస్తాం కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం అని అన్నారు.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చాడా పార్లమెంటులో ఏనాడైనా మాట్లాడటం జరిగిందా అని ప్రశ్నించారు. ఆయనకు ఇంగ్లీష్, హిందీ, భాష రాదని తెలుగు కూడా సరిగ్గా మాట్లాడలేడని ఎద్దేవ చేశారు. ధర్మం కోసం పనిచేసినట్లైతే ఓ ఆశ్రమాన్ని నెలకొల్పి సాధువుగా జీవించాలని దమ్ముంటే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంకు వచ్చి చర్చ పెట్టు అదే చర్చలో నేను పాల్గొంటా అని సవాలు విసిరారు. దేవుని ఫోటోలతో రాజకీయం చేయడం సబబు కాదని అన్నారు. భారీ మెజారిటీతో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ ను గెలిపించాలని అనంతరం జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీ గెలుపుకు కృషి చేస్తానని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాప్స్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, అందే సుభాష్, నంది కిషన్, మీసం రాజం, రాజు నాయక్, చీటీ నరసింహారావు, ఎలుసాని మోహన్, గుల్లపల్లి నరసింహారెడ్డి, కొండ రమేష్ గౌడ్, ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి పరశురాం గౌడ్, ఎనగందుల అనసూయ నరసయ్య, గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎడ్ల సందీప్, ఎస్టీ సెల్ అధ్యక్షులు సీత్యా నాయక్, మండల మహిళా అధ్యక్షురాలు అప్సర్ ఉన్నిసా అజ్జు, గ్రామ మహిళా శాఖ అధ్యక్షురాలు శామ మంజుల, మండల కో ఆప్షన్ నెంబర్ జబ్బర్, నమిలికొండ శ్రీనివాస్, జవాజీ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments