కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వార్దా నదిలో నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. జిల్లాలోని కౌటాల మండలం తాటిపల్లి వద్ద వార్దా నదిలో ఈ ఘటన జరిగింది. గల్లంతైన సంతోష్, ప్రవీణ్, కమలాకర్, సాయిలు నదిమాబాద్‌కి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు. వీరంతా స్నానం చేసేందుకు నదిలోకి దిగినట్లు సమాచారం. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం మరో ఇద్దరి యువకుల కోసం గాలిస్తున్న పోలీసులు.