రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన పులి రాజు (41) బ్రెయిన్ స్ట్రోక్ తో శనివారం రాత్రి 7 గం,ల ప్రాంతంలో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందాడు. రాజుకు బ్రెన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతునికి భార్య లత (38), ఇద్దరు కుమారులు హర్షవర్ధన్ (13), శశివర్ధన్ (10) ఉన్నారు. మృతుడు రాజు గ్రామంలో ఈ.జి.ఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు, గతంలో ఎంపిటిసి గా కూడా పనిచేశారు. రాజు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. అకాల మరణం చెందిన రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు


