ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత విద్య అందిస్తున్నామని యెల్లారెడ్డిపేట ప్రభుత్వ కళాశాలలో చేరాలనీ సద్వినియోగం చేసుకోవాలని అధ్యాపకులు కోరారు. తేదీ 20న గజసింగవరం, సముద్రలింగాపురం, తిమ్మాపూర్, గొల్లపల్లి, నారాయణపురం గ్రామాల్లో అధ్యాపకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉచిత పుస్తకాలు అందించబడుతాయనీ, అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, విశాలమైన గదుల సౌకర్యం, స్కాలర్షిప్ సౌకర్యం కలదనీ, తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల యెల్లారెడ్డిపేట అధ్యాపకులు క్యాతం సత్యనారాయణ, వాసరవేణి పర్శరాములు, మాదాసు చంద్రమౌళి, నీలాంటి విష్ణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.