లక్ష రూపాయలు అదనంగా కట్నం కావాలని వేధించిన కొడుకు తల్లి పై కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు. పట్టణ సీఐ కథనం ప్రకారం జమ్మికుంటకు చెందిన శ్రీలతతో వీణవంక గ్రామానికి చెందినసముద్రాల క్రాంతి అను వ్యక్తికి. 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. భర్త సముద్రాల క్రాంతి, అత్త తిరుపతమ్మలు అదనంగా కట్నం తీసుకురావాలని ప్రతిరోజు వేధించడంతో శ్రీలత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో తల్లి కొడుకుల పై కేసు నమోదు చేసినట్టు జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి పేర్కొన్నారు..