Wednesday, May 29, 2024
spot_img
HomeTELANGANAప్రభుత్వ పాఠశాలలో మెరిసిన బంగారు బాలిక

ప్రభుత్వ పాఠశాలలో మెరిసిన బంగారు బాలిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ పాఠశాలలో దినసరి కూలి దంపతుల పుత్రిక 10 కి 9.2 జి పి ఏ సాధించి ఉపాధ్యాయుల తల్లిదండ్రుల కలలను నెరవేర్చిన విద్యార్థిని. ఎల్లారెడ్డిపేట మండలం గ్రామానికి చెందిన దినసరి కూలీ తక్కలపల్లి మల్లేశం తక్కలపల్లి లక్ష్మి కూతురు సంకీర్తన ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తుంది. నిన్నటి రోజు పదవ తరగతి ఫలితాల్లో 9.2 జిపిఏ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన సంకీర్తన ఖరీదైన విద్యను అభ్యసించే స్తోమత లేక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇటు తల్లిదండ్రుల కలలను అటు ఉపాధ్యాయుల పేరును నిలబెట్టింది. విద్యార్థిని తక్కలపల్లి సంకీర్తన స్థానిక గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments