కోనరావుపేట మండలం, మామిడిపల్లి గ్రామంలోని మూల వాగు నుండి ఇంటి నిర్మాణాల కోసం ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ ద్వారా ట్రాక్టర్ యజమానులు ఇసుకను తరలించుటకు డిడిలు కట్టి వారంలో రెండు రోజులు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. అయితే పర్మిషన్ సమయము ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఎమ్మార్వో ఆఫీస్ నుండి రావలసిన పర్యవేక్షణ అధికారులు రాకముందే ట్రాక్టర్ యజమానులు పదుల సంఖ్యలో ట్రాక్టర్లను వాగులోకి పంపి ఇసుక నింపుతున్నారు. మళ్లీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత అధికారులు వెళ్లిపోయిన కూడా ట్రాక్టర్ యజమానులు యధావిధిగా ఇసుకను తరలిస్తున్నారు. ఇకనైనా అధికారులు సమయపాలన పాటించి, సరైన సమయంలో ఇంటి నిర్మాణాల కొరకు ఇచ్చిన పర్మిషన్లను సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.