హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల డిగ్రీ కళాశాలల బస్సు లను ఫిట్నెస్ ను తనిఖీ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచె వేణుకి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రైవేట్ పాఠశాలల మరియు డిగ్రీ కళాశాలలో బస్సులు రవాణా శాఖ నిబంధనలు పాటించడం లేదని బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తూ బస్సు కిటికీలకి గ్రిల్స్ పెట్టకుండా బస్సుల్లో ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కీట్ లేకుండా క్లీనర్లను ఉంచకుండా విద్యార్థులను తీసుకెళ్తున్నారని ఇలా నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వేంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు పాఠశాలల డిగ్రీ కళాశాలల బస్సులను ఫిట్నెస్ తనిఖీ చేయాలని అలాగే డ్రైవర్ల లైసెన్స్ లను తనిఖీ చేయాలని దాదాపు 30 బస్సులకు పైగా ఉంటాయని అందులో ఫిట్నెస్ లేని బస్సులను గుర్తించి వాటిని సీజ్ చేసి ఆయా ప్రైవేటు పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్, ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి రాపేల్లి రోహిత్, లంక దాసరి రాహుల్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు…