రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన ముత్యాల ప్రభాకర్ రెడ్డిని ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మంగళవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్.కె హుస్సేన్ కు ప్రధాన కార్యదర్శి లడే(సిరి )రవి , కోశాధికారి భీమిడి మాధవ రెడ్డి, ముఖ్య సలహాదారులు మహిమల కేదారి రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, కోశాధికారి సుధగోని సురేష్ గౌడ్, జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం, ఎల్లారెడ్డిపేట ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం సభ్యులకు, మిత్రులకు తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.