Warning: Uninitialized string offset 0 in /home/therainbowservic/inquilabtv.com/wp-includes/class-wp-dependencies.php on line 1

Warning: Uninitialized string offset 0 in /home/therainbowservic/inquilabtv.com/wp-includes/class-wp-dependencies.php on line 1
సీఎంకు ఆధారాలు ఎలా చేరాయి? - inquilabtv.com
Saturday, December 7, 2024
spot_img
HomeTELANGANAసీఎంకు ఆధారాలు ఎలా చేరాయి?

సీఎంకు ఆధారాలు ఎలా చేరాయి?

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు తీర్పులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘ఈ కేసుకు సంబంధించి ఆధారాలు, మెటీరియల్‌.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎలా చేరాయని ప్రశ్నించింది. వీటిని ఎవరు, ఎప్పుడు, ఎలా అందజేశారన్న అంశం ఇప్పటికీ మిస్టరీగానే ఉందని తెలిపింది. ‘‘ఏ చట్టం ప్రకారం, లేదా ఏ నిబంధనల ప్రకారం ఆధారాలు మొత్తం ముఖ్యమంత్రికి చేరాయో సిట్‌ గానీ, ప్రభుత్వం గానీ వివరించలేదు. దీని వెనుక ఉన్న థియరీ ఏమిటోతెలియదు. ఈ కేసులో ఫిర్యాదుదారైన ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డియే ఆధారాలను సీఎంకు ఇచ్చి ఉండవచ్చు అనే వాదనకు నిరూపణ లేదు’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అసలు.. డిఫ్యాక్టో కంప్లైనెంట్‌ అయిన రోహిత్‌రెడ్డికి ఏ దశలో, సీఆర్పీసీలోని ఏ సెక్షన్ల కింద ఆధారాలు మొత్తం అందజేశారో ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలపలేదని పేర్కొంది. పైగా అంత తక్కువ సమయంలో ఆడియోలు, వీడియోలు వంటి పలు రకాల ఆధారాలను రోహిత్‌రెడ్డికి ఎలా అందజేశారో చెప్పలేదని తెలిపింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఈ నెల 26న ఇచ్చిన తీర్పునకు సంబంధించి అధికారిక ఉత్తర్వుల కాపీ బుధవారం వెలువడింది. దీని ప్రకారం.. జీవో నెంబర్‌ 63 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఏకసభ్య ధర్మాసనం కొట్టేసింది. ఇప్పటివరకు రాజేంద్రనగర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌, సిట్‌ చేసిన దర్యాప్తును రద్దు చేసింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను, అక్టోబరు 26 నాటి అబ్జర్వేషన్‌ పంచనామాను, 27 నాటి మీడియేటర్‌ పంచనామాను సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ మొదటి నుంచి కొత్తగా దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ న్యాయవాదులు వివరణ ఇవ్వలేదు

పోలీసుల దర్యాప్తులో భాగంగా సేకరించిన ఎవిడెన్స్‌లు ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌లో ఎలా ప్రత్యక్షమయ్యాయనే విషయంపై ప్రభుత్వ న్యాయవాదులు వివరణ ఇవ్వలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎవిడెన్స్‌ మెటీరియల్‌ లీకేజీపై ప్రతివాదులు చాలా తెలివిగా వ్యూహాత్మక మౌనం పాటించారని పేర్కొంది. ఎవిడెన్స్‌లను ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు అన్ని రాష్ట్రాల చీఫ్‌ జస్టి్‌సలకు పంపించారని తెలిపింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తీవ్ర నేరమైనప్పటికీ చట్టంలో పేర్కొన్న నిబంఽధనలు, ప్రొసీజర్‌ ఉల్లంఘనకు గురయ్యాయా, లేదా అన్న అంశాన్ని ప్రధానంగా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అంశాలపై తాము ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని, అయితే ఆధారాలు పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టిన తీరు మాత్రం నిందితుల హక్కులకు భంగం కలిగించేదేనని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించిన మొత్తం ఘటనలు క్రిమినల్‌ లా ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా జరిగాయని తెలిపింది. కేసు నిరూపితమయ్యే వరకు ప్రతి నిందితుడు తప్పు చేయని వ్యక్తి కిందే లెక్క అనే ప్రాథమిక సూత్రం ఈ కేసు దర్యాప్తులో కనిపించలేదని పేర్కొంది.

నిందితులు హక్కులకు దూరమయ్యారు..

కుట్రదారులుగా జరిగిన ప్రచారం వల్ల నిందితులు తమ హక్కులకు దూరమయ్యారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను చట్టప్రకారం ఎదుర్కోవడానికి, న్యాయపరంగా తమ ఎదుట ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకునే అవకాశాన్ని కోల్పోయారని వ్యాఖ్యానించింది. ప్రాథమిక దశలోనే నిందితులను కుట్రదారులుగా అభివర్ణించి.. వారి హక్కులకు ఎటువంటి భంగం కలగలేదని చెప్పడాన్ని ఆమోదంచలేమని తెలిపింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ పోలీసులు చట్టప్రకారం వ్యవహరించకపోతే వ్యవహారాలను చక్కదిద్దడానికి ఆర్టికల్‌ 226 కింద తమ జోక్యం తప్పదని స్పష్టం చేసింది. దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారాలను థర్డ్‌ పార్టీలకు ఇవ్వకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. అత్యంత కీలకమైన ఆధారాలు ఇతరులకు చేరకుండా అడ్డుకోవడంలో దర్యాప్తు అధికారులు విఫలమయ్యారని, తద్వారా వారు తీవ్రమైన తప్పిదాలకు పాల్పడ్డారని పేర్కొంది. ఈ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే నవంబరు 9న రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని ఆక్షేపించింది. మొత్తం ఘటనల నేపథ్యంలో సిట్‌, ప్రభుత్వ వాదన న్యాయపరిశీలనకు నిలువదని పేర్కొంది. క్రిమినల్‌ చట్టం పరిధిలో నిందితుల హక్కులకు అత్యున్నత స్థానం ఉందని ‘అంకుశ్‌ మారుతీ షిండే’ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. పారదర్శక, వివక్షలేని దర్యాప్తు.. నిందితులకు ఉన్న హక్కులని, ఈ కేసులో అవి ఓడిపోయాయని వ్యాఖ్యానించింది. ఆర్టికల్‌14, 21ప్రకారం నిందితుల హక్కులకు భంగం వాటిల్లిందని పేర్కొంది.

సీఎం బహిరంగంగా వీడియోలు షేర్‌ చేశారు

రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పదవిలో ఉన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రే స్వయంగా ఎవిడెన్స్‌ వీడియోలను షేర్‌ చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఎం స్వయంగా నిందితులను కుట్రదారులుగా అభివర్ణిస్తూ ప్రచారం చేశారని తెలిపింది. ఈ పరిస్థితుల్లో సిట్‌.. ముఖ్యమంత్రి చెప్పినదానికి భిన్నంగా వ్యవహరిస్తుందని ఆశించలేమని పేర్కొంది. నిందితులు తమ హక్కులకు భంగం కలిగిందని నిరూపించారని చెప్పడంలో తమకు ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించింది. టీఆర్‌ఎ్‌స(బీఆర్‌ఎస్‌), బీజేపీ మధ్య నెలకొన్న రాజకీయ పోరులో నిందితుల హక్కులను పూర్తిగా మరిచిపోయి వ్యవహరించారని తెలిపింది. దర్యాప్తు బదిలీ చేయడానికి ఇది తగిన కేసు అని స్పష్టం చేసింది. కాగా, అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ విజ్ఞప్తి మేరకు ఈ ఆదేశాలకు సంబంధించిన సర్టిఫైడ్‌ కాపీ ప్రభుత్వానికి అందేవరకు ఆదేశాల అమలును నిలిపేస్తున్నట్లు ఽధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. బుధవారం తీర్పు కాపీ బయటకురావడంతో సర్టిఫైడ్‌ కాపీ కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఈ తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో ప్రభుత్వం సవాల్‌ చేయనుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments