రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీల నిర్వాహకులు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని యువత మాధకద్రవ్యాలకు బానిసలు కాకుండా అందరు సహకరించాలని జిల్లా ఎస్పీ అన్నారు. మెడికల్ షాపులు, ఏజెన్సీల నిర్వహకులతో ఈ రోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారిన పడుతున్న పరిస్థితులలో గంజాయిపై జిల్లాలో వరుసగా చేస్తున్న దాడులు చేస్తూ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడం లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ప్రతి మెడికల్ షాప్ ముందు భాగంలో సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన డి-ఆడిక్షన్ సెంటర్ కి సంబంధించిన పోస్టర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిలాల్లో మతుపదార్థాల నిర్ములనకు జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు మెడికల్ షాప్ యాజమానులు కూడా సహకరించాలన్నారు.
యువత సింథటిక్ డ్రగ్స్ వైపుకు ఆకర్షితులవుతున్న నేపథ్యంలో మెడికల్ షాపుల నిర్వాహకులు తరచుగా మత్తు మందుల కోసం వచ్చే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, అదే సమయంలో మెడికల్ షాపుల నిర్వాహకులకు రక్షణ కల్పించే విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్తు మందుల కారణంగా యువత నిర్వీర్యం అయి దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని, మంచి సమాజ నిర్మాణం, దేశ నిర్మాణంలో కీలకమైన యువత భవిష్యత్ మత్తు మందుల బారిన పడి నిర్వీర్యం కాకుండా కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే ముందులు ఎలాంటి పరిస్థితుల్లోనూ విక్రయించవద్దని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరు విక్రయించినా కఠినచర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి గడువు ముగిసిన, తక్కువ క్వాలిటీ, నకిలీ మత్తు మందులకు సంబంధించినవి వికయిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. అదేవిధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తును కలిగించే టాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో విక్రయిస్తే జైలు శిక్షలు తప్పవని, డ్రగ్స్ కేసులు మరింత కఠినంగా, జైలుకు వెళితే బెయిల్ సైతం రాకుండా చాలా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ భవాని, సిరిసిల్ల టౌన్ సి.ఐ రఘుపతి, మెడికల్ షాప్ యజమానులు, మెడికల్ ఏజెన్సీ యజమానులు పాల్గొన్నారు.