Saturday, July 13, 2024
spot_img
HomeTELANGANAమేడారం మహాజాతరకు 6 వేల బస్సులు సిద్ధం

మేడారం మహాజాతరకు 6 వేల బస్సులు సిద్ధం

మేడారం మహాజాతరను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మేడారం మహాజాతరపై ఆర్టీసీ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ జాతరకు 6వేల బస్సులను సిద్ధం చేసినట్లు 15వేల మంది సిబ్బంది జాతర విధుల్లో ఉంటారని తెలంగాణలోని 51 పాయింట్ల నుంచి బస్సులు నడిపిస్తున్నట్లు వివరించారు. జాతర బస్సుల్లో కోళ్లు, మేకలకు అనుమతి లేదన్నారు. ఈ సారి జాతరకు రెండువేల బస్సులను అదనంగా నడుపుతున్నట్లు చెప్పారు. జాతర బస్సులకు నార్మల్ ఛార్జీలే తీసుకుంటామని సజ్జనార్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments