భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదిలాబాద్ యాదవ సంఘ భవన్ లో జరుగుతున్న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నాయకులు ఆదిలాబాద్ ప్రయాణం అయ్యారు మార్గ మద్యన గల ఇంద్రవెల్లి అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించి అంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల లో మతోన్మాద బిజేపీ నీ ఓడించడం కోసం పని చేస్తామని అన్నారు. రాంజీ గొండ్, కుమురం భీం పోరాటాలు నడిపన గడ్డ ఆదిలాబాద్ పార్లమెంట్ అని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఆదివాసి సెంటిమెంట్ తో సోయం బాపురావు నియోజకవర్గ అభవృద్ధికి ఏమీ చేశాడని ప్రశ్నించారు. దేశంలో బిజేపీ మతం పేరుతో, దేవుడి పేరుతో ఓట్లు అడుగుతుందని వాళ్ళ ఆటలు పోరాట గడ్డ మీద సాగవని బిజేపీ క్యాండెట్ నీ మార్చడం తోనే తన ఓటమిని అంగీకరించిందని ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం కృషి చేస్తామని, ప్రతి ఒక్కరు చెయ్యి గుర్తుకు ఓటు వేసి పేదింటి ఆదివాసి ఆడపడుచును, ప్రశ్నించే గొంతుకను పార్లమెంట్ కు పంపించాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ వెళ్ళినా వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ముంజం ఆనంద్ కుమార్, ముంజం శ్రీనివాస్, దుర్గం రాజ్ కుమార్, నాయకులు కొరెంగా మాల శ్రీ, గెడం టీకనాంద్, తదితరులున్నారు..