Wednesday, September 16, 2026
spot_img
HomeTELANGANAకంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ ప్రారంభించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్

కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ ప్రారంభించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ సెంటర్, మీడియా సెంటర్ ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా 24 గంటలు పని చేసే కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ ను పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా మీడియాలో ఫేక్ న్యూస్ ప్రసారమైన, ఓటర్లు ఏదైనా సందేహాల నివృత్తికి, సమాచారం కోసం సంప్రదించిన వెంటనే స్పందించాలని చెప్పారు. ఎన్నికల ఫిర్యాదుల ఉంటే ప్రజలు కంట్రోల్ రూం నెంబర్ 1800 233 1495 అందుబాటులో ఫోన్ చేసి చెప్పవచ్చని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో DRDO శేషాద్రి, జడ్పీ డిప్యూటీ సీఈఓ గీత, డీపీఓ శర్ఫుద్దిన్, ఏవో రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments