కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సాయిబాబా గుడి వెనకాల మరియు పాత గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జాలు చేసుకుంటున్నారు రాజకీయ నాయలు. ఆ భూములను కాపాడుకోవడానికి కండువాలు చేంజ్ చేసుకుంటా వెళ్తారు నాయకులు, జిల్లా కలెక్టర్లకు, ఆర్డీఓ, తహసిల్దార్ దృష్టికి పోయిన కూడా ఏమీ తెలియనట్టు ఉంటారు. పేదోడికి ఓ న్యాయం రాజకీయ నాయకులకు ఒక న్యాయమా, పేదవాళ్లు బతుకు తెరువుకోసమో కాస్తంత గూడుకోసమో ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తే కేసులు అవుతాయి మరి రాజకీయ నాయకుల మీద ఎందుకు కేసులు కావు చట్టం ఎవరికి చుట్టం కాదు అన్నమాట వాస్తవం కాదా. మరి అ చట్ట ప్రకారం చట్టాన్ని గౌరవించి ఏ అధికారులు పనిచేస్తున్నారు, రైతులు సర్కారు ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కానీ న్యాయమైతే జరగడం లేదు పేదవాడి కంప్లైట్కు సంవత్సరాలు గడుస్తున్న రెస్పాన్స్ ఉండదు. రాజకీయ నాయకులు సర్కారు ఆఫీసులలో కూసుంటే ఒక్క గంటలో పనిచేసేస్తారు అధికారులు. అదేవిధంగా పేద రైతులకు కూడా స్పందించి నాయం చెయ్యండి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ స్పందించి కౌటాల మండలంలో గవర్నమెంట్ భూములను కబ్జాలు చేసిన రాజకీయ నాయకులకు తగిన శిక్షలు వేయండి అంటున్నారు స్థానికులు.