లోక్ సభ ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా వాంకిడి మండలానికి విచ్చేసిన ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణక్కతో వాంకిడి మండలం, జిల్లా జర్నలిస్టులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి సామాన్య నిరుపేదల ప్రజల సమస్యలను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నా అనంతరం సుగుణక్క జర్నలిస్టుల గూర్చి మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులు అత్యంత కీలకమైన భూమికను పోషించాల్సి ఉందని జర్నలిస్టులు సమతూకంగా తమ కథనాలతో సమాజాన్ని మేల్కొలపడంలో బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఫోర్తు ఎస్టేట్ జర్నలిజం వృత్తిలోకి వచ్చిన వారు నిబద్ధతతో ఉంటూ రాగద్వేషాలకు అతీతంగా కీలకమైన బాధ్యతను నిర్వర్తించాలన్నారు. వృత్తి ధర్మాన్ని పాటిస్తూ నిరంతరం న్యూస్ సేకరణలో ఉండే జర్నలిస్టులు తమఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ తమ కుటుంబ సంక్షేమం పట్ల కూడా శ్రద్ధ వహించాలని కొత్త సంవత్సరంలో జర్నలిస్టులూ వారి కుటుంబీకులూ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు జర్నలిస్టులకు కష్టనష్టాల్లో తోడుంటానని తెలిపారు.