అన్నా-చెల్లెళ్ళ అనుభందానికి రక్షా బంధన్ ప్రతీకని, ఆడబిడ్డల సంక్షేమం కోసం ఆలోచించే ఓకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఉచిత బస్ సౌకర్యం ద్వారా అనేక మంది ఆడబిడ్డలకు చేయూత ఇచ్చామన్నారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్. రక్షా బంధన్ సందర్భంగా సమాజంలో సోదర భావం మరింత పెంపొందాలని, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్. మహిళల రక్షణ పట్ల, మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించామని, ఉచిత బస్ సౌకర్యం ద్వారా అనేకమంది స్త్రీలు లబ్ధి పొందారని రాబోయే రోజుల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు..