హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపువచ్చింది. దీంతో వారు ఇరువురు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం బీజేపీ అగ్రనేతలతో ఈటల, రాజగోపాల్‌రెడ్డి భేటీకానున్నారు. మోదీ సభ తర్వాత ఈటల, రాజగోపాల్‌కు హైకమాండ్ నుంచి పిలుపు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా మరో బీజేపీ నేత డీకే అరుణ ఇప్పటికే ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే.