రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా లేబర్ అడ్డా సమీపంలోని సందిలో శ్రీ వినాయక ఎలక్ట్రానిక్స్ హోమ్ అప్లయన్స్ వ్యాపారి సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన వినియోగదారులను బంధుమిత్రులను నమ్మించి మూడు కోట్ల రూపాయల కుచ్చు టోపి పెట్టి గుట్టుచప్పుడు కాకుండా ఊడయించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా అతని భార్య లావణ్య సిరిసిల్ల పద్మనగర్ మహిళా గ్రూపులో మూడు లక్షలతో ఊడయించింది. దీంతో నిరుపేద మహిళలు లబోదిబోమంటున్నారు.
మార్గదర్శి, శ్రీరామ, శ్రీ నిధి చిట్ పండ్ లతో పాటు ప్రైవేట్ చిట్టి వ్యాపారుల వద్ద తనును నమ్మిన ప్రభుత్వ ఉద్యోగ మిత్రులతో సూరిటీ పెట్టించి వారిని కూడా ఘరానా మోసం చేశాడు. అంతేకాకుండా మున్సిపాలిటీ వెనుకాల గల రోడ్డులోని చాట్ బండార్ ఎదురుగా ఉన్న కమర్షియల్ బిల్డింగ్ ను 35 లక్షలకు గుట్టు చప్పుడు కాకుండా విక్రయించుకొన్నాడు. వ్యూహాత్మకంగా వ్యవహరించి వినియోగదారులను బంధుమిత్రులను ఘరానా మోసం చేసి లీగల్ గా మూడు కోట్ల కుచ్చుటోపి పెట్టి భార్య పిల్లలతో పరారయ్యాడు.
తలుపు రాజు 9396927485 నెంబర్ చరవాణి కి ఫోన్ చేస్తే పూణే, నాసిక్, సంఘనేర్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. మూడు కోట్లతో ఊడాయించిన తవుటు రాజు పై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెలితే లీగల్ గా వెళ్లండని చేతులు దులిపేసుకుంటున్నట్లు తవుటు రాజు బాదితులు లబోదిబోమంటున్నారు. కష్టపడి పొదపు చేసుకున్న డబ్బులను మిత్తి కోసం ఆశపడి ఇస్తే మా కొంపముంచి మూడు కోట్లతో పారిపోయిన తవుటు రాజు ను పట్టుకొని మా డబ్బులు మాకు ఇప్పించాలని బాదితులు జిల్లా ఎస్ పి కి విజ్ఞప్తి చేస్తున్నారు,