రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లో ముస్తాబాద్ పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 374 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ముస్తాబాద్ కూడలిలో ఉన్న సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తదనంతరం పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ కులస్తుల ధీరత్వానికి ప్రతిక అని, తెలంగాణ బహుజన వీరుడు అయిన సర్వాయి పాపన్న గౌడ్ రాచరిక వ్యవస్థను వ్యతిరేకిస్తూ జమీందారీ వ్యవస్థ ఆధిపత్యాన్ని ఎదిరించిన మహావీరుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మండలాధ్యక్షుడు కొండ యాదగిరి గౌడ్, యాదగిరి, దేవేందర్, రాజారాం, బాలయ్య, ఎల్లయ్య, లక్ష్మయ్య, శ్రీనివాస్, శేఖర్, దేవదాస్, సంతోష్, లక్ష్మణ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.