ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జోలికి వస్తే ఊరుకునేది లేదని సమతా సైనిక్ దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్నలు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం రామగుండం ప్రెస్ క్లబ్ లో సమతా సైనిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘాల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గోమాసే శ్రీనివాస్ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన మొదటిసారి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా మంచిర్యాల జిల్లాలకు వస్తున్న సందర్భంగా శ్రీనివాస్ గోమాసే కు సమతా సైనిక దళ్ , నేతకాని దళిత సంఘాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలుకుతూ పలు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ భారీ ఎత్తున ర్యాలీగా వెళుతున్న శ్రీనివాస్ గోమాసే కాన్వాయ్ ని చూసి తట్టుకోలేని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని చెడగొట్టాలని శ్రీరాంపూర్ ఏరియాలో కొంతమంది రౌడీ మూకలను, కిరాయి గుండాలని ఏర్పాటు చేసి రోడ్ సోనీ అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన ప్రేమ్ సాగర్ రావుని టిపిసిసి అధిష్టానం వెంటనే పార్టీ నుండి భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు . దళిత జాతిలో పుట్టి జాతీయ స్థాయిలో ఉన్నత పదవిలో ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘాలను కోఆర్డినేషన్ చేస్తూ భారత రాజ్యాంగ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా పదవి పొందడం చూసి వంట పట్టడం లేదన్నారు . సాధారణ కుటుంబం నుండి జాతీయస్థాయిలో పేరు సంపాదించుకోవడానికి చూసి ఓర్వలేని అగ్రవర్ణ నాయకులను ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు . ఫాసిస్టు విధానాలను అవలంబిస్తూ మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు తమ పద్ధతి మార్చుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేదంటే వచ్చే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలు రాజకీయంగా బొంద పెట్టడం ఖాయమని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక పెద్దపల్లి జిల్లా నాయకులు దుర్గం విశ్వనాధ్ దూట రాజు, నేతకాని సంఘం సీనియర్ నాయకులు దుర్గం వెంకటేశ్వర్లు ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు