ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో రాళ్ల వర్షం కు గురికాకుండా కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ఎల్లారెడ్డి పేటలోని రావి చెట్టు హన్మాండ్లు వద్ద ముడుపు కట్టడం కార్యక్రమం, ఆదివారం రాత్రి కామ దహనం కోసం పిడకలు సేకరించడం, సోమవారం హోళీ పండుగ జరిపే విధానం పై చర్చలు సాగాయి. ఈ కార్యక్రమం లో స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్, రెడ్డి సంఘం మండల అధ్యక్షుడు గుండాడి వెంకట్ రెడ్డి, శ్రీ లక్ష్మి కేశవ పేరమాండ్ల దేవస్థాన కమిటీ చైర్మన్ పారిపెళ్లి రాం రెడ్డి, బిజెపి నాయకులు యమగొండ కిష్ఠారెడ్డి, స్థానిక గౌడ సంఘం అధ్యక్షుడు నాగుల ప్రదీప్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రేసు శంకర్, లింగాల దాసు, కుమ్మరి లచ్చయ్య, జల్లి శంకర్, జల్లి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.