కరీంనగర్ లోక్ సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా. జమ్మికుంటకు చెందిన రాపోల్ రామ్ కుమార్ భరద్వాజ్ శనివారం కరీంనగర్ కలెక్టరేట్ లో తన నామినేషన్ పత్రాలు దాఖలాలు చేశారు. రాపోల్ రామ్ కుమార్ భరద్వాజ్ పాత్రికేయుడిగా నియోజకవర్గంలో ప్రజలకు సుపరిచితుడు. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని నమ్మి ప్రజల సమస్యలను చట్టసభల్లో వినిపిస్తే త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని తానూ రాజకీయాల్లోకి వచ్చానని పార్లమెంట్ సభ్యుడిగా తనను గెలిపిస్తే ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి శాయశక్తులా కృషిచేస్తానని రాపోల్ రామ్ కుమార్ భరద్వాజ్ అన్నారు.