రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట, గొల్లపల్లికి చెందిన పలు సమస్యలపై ఎల్లారెడ్డి పేట మాజీ MPTC కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎల్లారెడ్డి పేటలో 1993వ సంవత్సరంలో కిషన్ దాస్ పేట నుండి నంది విగ్రహం వరకు సీసీ రోడ్డు నిర్మించారు. అది పూర్తిగా చెడిపోయింది. రోడ్డు పూర్తిగా చెడిపోయి గతుకులమయంగా మారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇట్టి రొడ్డును తిరిగి సీసీ రోడ్డు వేయడానికి నిధులు మంజూరు చేయాలని, మంగలయ్య కాలువ నుండి పోచమ్మ వరకు 600 మీటర్ల మేర మురికి కాలువ నిర్మాణం చేయాలని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో రెండు అంగన్ వాడీ కేంద్రాలు నిర్మాణం జరిగి మూత్రశాలలు నిర్మాణం లేక పాత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయని మూత్రశాలల నిర్మాణం జరిగితే ఇక్కడి అంగన్వాడీ కేంద్రాలు హైస్కూల్ కి మార్చి అట్టి ప్రాథమిక పాఠశాలను గ్రామ మహిళ స్వశక్తి సమావేశ మందిరంకు కేటాయించవచ్చని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఆయన వెంట బుచ్చి లింగు సంతోష్ గౌడ్ ఉన్నారు