జమ్మికుంట గాంధీ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ బ్లాక్-కాంగ్రెస్ అధ్యక్షులు మొలుగూరి సదయ్య, ఆధ్వర్యంలో ఆదివారం రోజున ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ బాబు, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వసతి గృహాలు, రెసిడెన్స్ స్కూల్లో, బీసీ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మైనార్టీ గురుకుల పాఠశాలలో పిల్లలకు మూడవ తరగతి నుండి పీజీ విద్యార్థుల వరకు మెస్ చార్జీలు పెంచినందున, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రణవ్ బాబుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గూడెపు సారంగపాణి, జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మదన్ రావు, ఫిషర్మెన్ నాయకులు పింగిలి రాకేష్, బండి మల్లేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నగంటి రవీందర్, సతీష్ రెడ్డి, బుర్ర కుమార్ గౌడ్, దోగ్గల భాస్కర్, ఇమ్రాన్, తిరుపతి శ్రీనివాస్, గుల్లి జపానియా, దొడ్డే సదానందం, తోట సప్న, బుడిగే శ్రీకాంత్, సుమన్, చంచల శ్రీనివాస్, పందిళ్ళ శంకర్, మైస సాంబయ్యలతో పాటు దాదాపు 50 మంది కార్యకర్తలు పాల్గొన్నారు..